Telugu Kavithalu



పల్లె గోదారి 
మనసు వెన్న పూస...
మాటలు కారం పూస...
స్వచ్చమైన గాలి శ్వాస...
మాది గోదావరి యాస..
     
ఊరి చివర మర్రి మాను ...
ఏపుగా ఎదిగిన వరి  చేను ..
ఇంటి పక్క పొట్టి శీను ..
తలచుకుని మైమరచేను... 

గోదారి గట్టున కేరింతల హొరు...
పుష్కరాలకు పెట్టింది పేరు ...
సంక్రాంతి పండగ కి మా ఊరు..
జాతరల మోతతో హుషారు ...

                                         -శివరామ్ 


 స్నేహం -ప్రేమ

పగటి పూట చంద్రుని ,సూర్యుని కాంతి దాచేస్తుంది ..
గుండెలోని ప్రేమని ,స్నేహ భావం కాల్చేస్తుంది...

మన స్నేహం ప్రేమగా మారే  రోజు  ....
ఎప్పటికీ రాదా .

స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ఈ  హృదయం ..
ప్రేమకోసం పనికి రాదా..

ప్రేమకు స్నేహం పునాది కాదా...
స్నేహం లేని ప్రేమ సమాధి కాదా...

గుండెలోని  ప్రేమ ,కళ్ళలో  కనపడలేదా..
మనసు లోని మాట, ఒక్కటైనా వినపడలేదా..

నీకు చెప్పలేక, నేను పడుతున్న బాధ ...
ఇప్పటికయినా అర్ధం చేసుకో నా వ్యధ..
                                                         -శివరామ్ 



మహా ప్రస్తానం..

మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం కదిలింది
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం పోదాం పైపైకి
కదం తొక్కుతూ.. '
పదం పాడుతూ
హృ దంత రాళం ఘర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరోప్రపంచపు జలపాతం!
దారి పొడవునా గుండె నెత్తురులు
తర్పణం చేస్తూ పదండి ముందుకు
బాటలు నడిచీ
పేటలు కడచీ
కోట లన్నిటినీ దాటండి
నదీ నాదాలు
అడవులు కొండలు
ఎడారులా మన అడ్దంకి
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం పోదాం పైపైకి
ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి !
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం: హరా: అని కదలండి
మరో ప్రపంచం
మరో ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనం వలె హొరెత్తండి
భావ వేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోష వలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి
పదండి! పదండి!
కనబడలేదా మరో ప్రపంచపు
కణ కణ మండే త్రేతాగ్ని?
ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మెరుపులు
తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి..
సల సల క్రాగే చమురా కాదిది
ఉష్ణ రక్త కాసారం!
శివ సముద్రము
నయగారా వలె
ఉరకండీ! ఉరకండీ! ముందుకు
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!
త్రాచుల వలెనూ
రేచుల వలెనూ
ధనుంజయునిలా సాగండి
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగ ధగలు
ఎర్ర బావుటా నిగ నిగలు
హోమజ్వాలల భుగ భుగలు !

తెలుగు జోక్స్

ఒక పిచ్చాసుపత్రిలో రోగులు ఎక్కువైపోయారు. ఆసుపత్రిలో వైద్యులంతా కలిసి పిచ్చి కొంచెం నయమైన వారినైనా డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నారు. రోగులందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. అందర్నీ కలిపి ఒక పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఒక డాక్టర్ వెళ్ళి గదిలో ఉన్న పెద్ద బ్లాక్ బోర్డు పైన నిజంగా తలుపేనా అనిపించేలాగా సుద్ద ముక్కతో అందంగా ఒక చిత్రం గీశాడు.
తరువాత ఒక డాక్టర్ అందర్నీ ఉద్దేశించి “మీలో ఎవరు వెళ్ళి ఆ తలుపు తెరుస్తారో వాళ్ళకు మంచి ఐస్‌క్రీం బహుమానంగా దక్కుతుందని” ప్రకటించాడు.
అలా చెప్పడమే తరువాయి అందరూ ఒకరు మీద ఒకరు పోటీ పడుతూ వెళ్ళి బోర్డు మీద పడసాగారు.
డాక్టర్లందరూ ఒక్కసారిగా డీలా పడీపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం కుర్చీలో ఒంటరిగా కూర్చుని మిగతా వాళ్ళని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.
డాక్టర్లు “హమ్మయ్య! కనీసం ఒకడైనా దొరికాడు” అనుకుని
ఆ రోగి దగ్గరకు వెళ్ళి. ” ఏం బాబూ! అందరూ ఐస్‌క్రీం కోసం ఆ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం తీరిగ్గా కుర్చీలో కూర్చుని సరదా చూస్తున్నావు?”
“ఓ అదా! మీకో విషయం తెల్సా! దాని తాళం నా దగ్గరే ఉంది. అది తెలియక పిచ్చి వెధవలు తెగ ఆరాటపడిపోతున్నారు!!!!” అంటూ పగలబడి నవ్వసాగాడు.
 

డాక్టర్లకి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు

--